NGKL: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా డిపో మేనేజర్ యాదయ్య అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశానికి అంబేద్కర్ అందించిన సేవలు, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని డిపో మేనేజర్ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.