HYD: సెల్ఫోన్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఏప్రిల్ 3 నుంచి 9 వరకు జరిగిన తనిఖీల్లో 6,046 కేసులు నమోదయ్యాయి. ఇందులో 5,810 ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చార్జిషీట్ దాఖలు చేస్తామని, ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తామని జాయింట్ సీపీ జోయల్ డెవిస్ హెచ్చరించారు.