ADB: నార్నూర్ మండలంలో గురువారం కేంద్ర నీతి ఆయోగ్ బృందం పర్యటించింది. ఆస్పిరేషనల్ బ్లాక్‌గా నార్నూర్ ఎంపికైన సందర్బంగా జాండ, గుంజాల గ్రామాల్లోని పలు పాఠశాలలను సందర్శించారు. అధ్యాపకుల బోధన విధానాన్ని పరిశీలించి విద్యార్థులు సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బృందం ప్రతినిధి అన్నేక మాఝి, డీఆర్డీవో రవీందర్, ఎంపీడీవో పుల్లారావు పాల్గొన్నారు.