KNR: చొప్పదండి మండలం ఆర్నకొండలోని 3వ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం ఏ ఎల్ ఎం ఎస్ సి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తల్లి శిశు పోషణపై అవగాహన కల్పించారు. గర్భవతులు, బాలింతలు సరైన పౌష్టికాహారం తీసుకోవాలని, పోషణ లోపం ఉన్న పిల్లలకు బాలామృతం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పిట్టల అమృత, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.