MNCL: నెన్నెల మండలంలో సోమవారం MLA గడ్డం వినోద్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నెన్నెలలో “ఇందిరమ్మ ఇళ్ల” ప్రారంభం, ఉదయం 9:30కు కుమ్మరివాడలో “నూతన బోరు మోటార్” ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.