NRPT: మక్తల్ మండలం మంథనోడ్ నుంచి పాతర్చెడ్కు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలతో నిండిపోయి ప్రమాదకరంగా మారింది. వర్షాలప్పుడు పరిస్థితి మరింత భయంకరంగా మారుతోందని, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు అధికారులు ప్రజల సమస్యను దృష్టిలో ఉంచి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.