WGL: నగరంలో పదవీవిరమణ చేసి 6నెలలు గడిచినా తన భర్తకు రావాల్సిన ప్రయోజనాలు అందలేదని విజయలక్ష్మి నేడు సామాజిక మాధ్యమాల్లో సీఎం రేవంత్‌ను వేడుకున్నారు. ఏఎస్ఐగా రిటైర్ అయిన వీవీఎల్ఎన్ మూర్తి గుండెసమస్యతో సికింద్రాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. అప్పులు, వైద్య ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని కోరారు.