ADB: డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం నిర్వహించిన అంబేద్కర్ జయంతి 135వ వేడుకల్లో భాగంగా ఆయన విగ్రహానికి SP అఖిల్ మహాజన్, MLA పాయల్ శంకర్‌తో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాజ్యాంగంతోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.