SRCL: జాతీయ అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం వేములవాడ అగ్నిమాపక కేంద్రంలో ఇంఛార్జ్ అధికారి సిహెచ్. సాయిలు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వారం రోజుల పాటు అగ్నిప్రమాద నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రమాదాలు సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు తెలియజేశారు. వేసవిలో అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే 101కి ఫోన్ చేయాలని పేర్కొన్నారు.