WNP: తెలంగాణలో ప్రవేశిస్తున్న కృష్ణానదిపై అవసరాలకు అనుగుణంగా బ్యారేజీలు నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. తంగడి గ్రామం వద్ద వీటి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బ్యారేజీల వల్ల నీటి కొరత సమయంలో సాగు, తాగునీటి అవసరాలకు ఎంతో వీలుగా ఉంటుందని ఆయన వివరించారు.