NLG: ఆసియా ఖండంలోనే రైస్ ఇండస్ట్రీకి మిర్యాలగూడ కేంద్రబిందువుగా మారింది. ఇక్కడ 100కు పైగా అత్యాధునిక రైస్ మిల్లులు కొలువుదీరడంతో ధాన్యం ప్రాసెసింగ్లో ఈ ప్రాంతం గుర్తింపు సాధించింది. ఇక్కడి నాణ్యమైన బియ్యం దేశ విదేశాలకు ఎగుమతి అవుతుండటంతో వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఆధునిక సాంకేతికతతో జరుగుతున్న ఈ ఉత్పత్తి వల్ల రైతులకు గిట్టుబాటు ధర దక్కుతోంది.