NGKL: పెద్దకొత్తపల్లి బస్టాప్ సమీపంలో మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ సొంత ఖర్చులతో చలివేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల దాహం తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఈ సేవను అభినందించారు.