MDK: జిల్లాలో గత 9 నెలల్లో వివిధ రంగాలకు రూ.4,611 కోట్ల రుణాలను పంపిణీ చేసి, వార్షిక లక్ష్యంలో 67.32 శాతం పూర్తి చేశామని అడిషనల్ కలెక్టర్ నగేష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రైతులకు, మహిళా సంఘాలకు రుణాల పంపిణీలో పెద్దపీట వేశామన్నారు.