NLG: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని గుర్తు తెలియని వ్యక్తి సుమారు 8 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా.. పట్టణంలోని కబరాస్తాన వద్ద పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.