MNCL: ప్రపంచ హీమోఫీలియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం మంచిర్యాలలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత ర్యాలీని ప్రారంభించి మాట్లాడుతూ తల్లిదండ్రుల నుంచి ఈ వ్యాధి పిల్లలకు సంక్రమిస్తుందని తెలిపారు. వ్యక్తిగత ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తగిన జాగ్రత్తలు తీసుకుంటే తగ్గించవచ్చని తెలిపారు.