ADB: పర్దాన్ జనజాతి ఉత్తన్ సంఘటన్ సాత్నాల మండల అధ్యక్షుడిగా గెడమ్ జగన్నాథ్ నియమించినట్లు సంఘటన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్వ నగేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం వారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జగన్నాథ్ మాట్లాడుతూ.. మండల పర్దాన్ సమాజ్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్దాన్ సమాజ్ నాయకులు పాల్గొన్నారు.