HNK: పరకాల మున్సిపాలిటీ పరిధిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభలను నిర్వహించారు. రెండవ వార్డులో నిర్వహించిన వార్డు సభకు స్థానిక కౌన్సిలర్ శ్యామల బాబురావు హాజరై ప్రజల వద్ద వినతులను స్వీకరించారు. వార్డు పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటూ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కౌన్సిలర్ తెలిపారు.