NLG: భారతీయ సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆకిటి శంకర్ ముదిరాజ్ ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఫూలే కేవలం ఒక వ్యక్తి కాదని, ఒక గొప్ప సామాజిక శక్తి అని కొనియాడారు.