NRPT: 18 ఏళ్ల లోపు పిల్లలకు వాహనాలు నడిపేందుకు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ శివశంకర్ హెచ్చరించారు. బుధవారం నారాయణపేట పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాహనాలు తనిఖీ చేశారు. వాహనాలు నడుపుతున్న 16 మంది మైనర్లను గుర్తించి వాటికి కౌన్సిలింగ్ ఇచ్చారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని చెప్పారు.