MHBD: నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన డోనికేనా పెద్ద నరసయ్య(80) అనే గీత కార్మికుడు గత ఆరు రోజుల క్రితం తాడిచెట్టు పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. గీత కార్మికుడి మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.