NRPT: మరికల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజీ, కేజీబీవీ (KGBV) విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. కేజీబీవీలో అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ విభాగంలో ఐశ్వర్య 500 మార్కులకు గాను 495 మార్కులు సాధించగా, బైపీసీలో అక్షయ 440కి 402 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి తెలిపారు. ఇక గురుకుల కళాశాల ఏకంగా 98% ఉత్తీర్ణతతో సత్తా చాటింది.