ADB: జైనూర్ మండలం జంగాం గ్రామానికి చెందిన ఓరే రామ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ DCC అధ్యక్షురాలు ఆత్రం సుగుణ ఆదివారం రాత్రి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని భగవంతుని ప్రార్థించారు. పరామర్శించిన వారిలో నాయకులు ముఖిద్, అర్జున్, సయ్యద్, సబీర్ తదితరులున్నారు.