ADB: ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాలో ఆదిలాబాద్ జిల్లా 14వ స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన ‘ఎల్డోరాడో వెదర్’ సంస్థ తాజాగా ఈ వివరాలను వెల్లడించింది. భానుడి భగభగలతో జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఉక్కపోతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.