KMM: జిల్లాలో మొక్కజొన్న విత్తన కంపెనీల ఆర్గనైజేర్లు, మధ్యవర్తుతుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ అన్నారు. రబీ వ్యవసాయ సీజన్లో రైతులకు మొక్కజొన్న విత్తన కంపెనీలు విత్తనాలు సరఫరా చేసి, పంట కొనుగోలు చేస్తామని చెప్పి మోసం చేస్తున్నాయని తెలిపారు.