MNCL: తాండూర్ మండలం రాజీవ్ నగర్‌కు చెందిన ప్రణీత్ (25) అనే సింగరేణి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండో షిఫ్టు ముగించుకుని అర్ధరాత్రి బుధవారం 1 గంటకు ఇంటికి వచ్చిన ఆయన, ఆ తర్వాత ఇంట్లో ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. యువ కార్మికుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.