KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు అల్పాహారం అందించే తొలి ముద్ద పథకం అమలుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని 2,135 కేంద్రాల్లో ఉన్న 42,600 మంది చిన్నారులకు ఉప్మా, కిచిడీ మిక్స్‌లను బ్రేక్ ఫాస్ట్ అందించనున్నారు. ఆరేళ్లలోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించి, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందని అధికారులు సూచిస్తున్నారు.