MBNR: బాలానగర్ మండలంలోని గుండేడులో సోమవారం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి – ప్రణాళికలో భాగంగా, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై లెనిన్ గ్రామస్థులకు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.