SRCL: ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను పెండింగ్ పెట్టవద్దని సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగ్రవాల్ అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి 270 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు.