BHPL: భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో రేపు జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో విధుల్లో నిమగ్నమై ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు.