HYD: ధూల్‌పేటలోని దిలావర్ గంజ్‌కు చెందిన గంజాయి విక్రేత మహేశ్వరిని అదుపులోకి తీసుకుని 1.2 కేజీల గంజాయి సీజ్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ మధుబాబు తెలిపారు. STF టీమ్ లీడర్ అంజిరెడ్డి ఆదేశాల మేరకు గోపాల్ ఇతర అధికారులు సిబ్బంది జరిపిన సోదాల్లో సదరు మహిళ ఇంట్లో గంజాయిని గుర్తించినట్లు తెలిపారు. ఈ సోదాల్లో సీఐ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.