SDPT: ప్రతి రోజు డైట్ మెనూ పాటిస్తూ నాణ్యమైన ఆహార పదార్థాలను రుచికరంగా వండాలని జిల్లా కలెక్టర్ హైమావతి వంట సిబ్బందిని ఆదేశించారు. జగదేవ్ పూర్లోని కేజీబీవీ పాఠశాలను బుధవారం ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం తీగుల్ గ్రామంలోని పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. .