WGL: మొక్కజొన్న పంట కొనుగోలులో ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని బీజేపీ జిల్లా నాయకుడు కుందూరు మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం వర్ధన్నపేట పట్టణంలో ఆయన మాట్లాడుతూ.. ఎకరాకు 25 క్వింటాళ్లు మాత్రమే మొక్కజొన్న కొనుగోలు చేయడం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోందన్నారు. పెరిగిన దిగుబడిని గుర్తించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు.