KMR: చిన్నపాడిశాల గ్రామంలో బుధవారం పశు వైద్యాధికారి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటూ నివారణ టీకాలు వేశారు . ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజారి సులోచన బిక్షం, వైద్య సిబ్బంది, గోపాలమిత్ర బృందం, రైతులు పాల్గొన్నారు.