SRD: గుమ్మడిదల మండలంలోని వీరారెడ్డి పల్లి గ్రామపంచాయతీ పరిధిలో బోయిని దర్శన్‌కు కేటాయించిన మొదటి ఇందిరమ్మ ఇల్లు సర్పంచ్ నర్సింగరావు, ఎంపీడీవో ఉమాదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్, రాజు, కవిత, శ్రీలతతో పాటు పాలకవర్గం, కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.