NZB: ఎన్టీఆర్ కాలనీ వైపు ప్రహరీ నిర్మాణంపై హైకోర్టు మూడు వారాల స్టే విధించినప్పటికీ ఆర్మూర్ ఆర్టీసీ అధికారులు పనులు ప్రారంభించేందుకు ప్రయత్నించగా వివాదం నెలకొంది. స్టే విషయం కాంట్రాక్టర్కు తెలియజేయకపోవడంతో పనులు మొదలుపెట్టగా కాలనీవాసులు కోర్టు ఉత్తర్వుల ప్రతిని చూపించడంతో పనులు నిలిచిపోయాయి.