ASF: ఆసిఫాబాద్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మి హాజరయ్యారు. ట్రాఫిక్ నిబంధనల “అరైవ్ -అలైవ్” గోడ పత్రికను ఆవిష్కరించారు. హెల్మెట్ లేకపోతే ప్రాణాలకే ప్రమాదమని, ప్రాణ రక్షణలో అది కవచంలా పనిచేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం-సురక్షితంగా ప్రయాణిద్దాం! అని ప్రతిజ్ఞ చేశారు.