GDWL: మానవపాడు మండలంలో శ్రీ ఈదమ్మ అమ్మవారి పండుగ వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. మంగళవారం నిర్వహించిన ఎద్దుల బండలాగుడు పోటీలను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఇటువంటి వీర క్రీడలు గ్రామాల్లో నూతనోత్సాహాన్ని నింపుతాయని ఆయన పేర్కొన్నారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేను సన్మానించి అమ్మవారి చిత్రాన్ని బహుకరించారు.