SDPT: హుస్నాబాద్ పట్టణంలోని నాగులమ్మ రోడ్డులో నివాస గృహాల మధ్యలో ఉన్న తుంగ గడ్డిని వెంటనే తొలగించి, కాలనీవాసుల సమస్యలు పరిష్కరించాలని అక్కడి ప్రజలు మున్సిపల్ కమీషనర్ కు వినతిపత్రం అందజేశారు. ఖాళీ స్థలంలో పెరిగిన గడ్డి పూతతో ఇబ్బందులు పడుతున్నామని, ఇంటిలోని వస్తువులపై పూత పడుతోందని, అలాగే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కాలనీవాసులు తెలిపారు.