VKB: వికారాబాద్ 26వ వార్డు బాల్ భవన్ సమీపాన గల అస్సాం బేకరీ వద్ద రహదారిపై నీరు నిలిచింది. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులపైనే దృష్టి సారిస్తున్న అధికారులు.. అంతర్గత రోడ్ల సమస్యలను విస్మరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి నీటిని తొలగించాలని ప్రజలు కోరారు.