VKB: మర్పల్లిలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పూలే ఆశయాలు సమాజానికి దిక్సూచి అని ప్రెస్ క్లబ్ సభ్యులు కొనియాడారు. అయితే, ఇంతటి మహనీయుడి జయంతి వేడుకలను రాజకీయ నాయకులు, అధికారులు నిర్వహించకపోవడం శోచనీయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.