SRPT: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ఆరోగ్యశ్రీ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ అన్నారు.