MNCL: కన్నెపల్లి పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణ పనులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, తదితరులు ఉన్నారు.