HNK: ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన మహనీయులు డా.బిఆర్ అంబేద్కర్ అని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నేడు అంబేద్కర్ జయంతి సందర్భంగా హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహానికి కడియం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలందరికి ఆరాధ్య దైవం అంబేద్కర్ అన్నారు.