ADB: మారుమూల గ్రామాల్లోని ఆదివాసీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని 102 అంబులెన్స్ జిల్లా మేనేజర్ మనోహర్ అన్నారు. ఉట్నూర్ మండలంలోని 102 అంబులెన్స్‌ను పర్యవేక్షించి రికార్డులు, పరికరాలను తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు చేశారు. గర్భిణీ మహిళలను సమయసారిని ప్రకారం ఆసుపత్రికి తీసుకెళ్లి సురక్షితంగా ఇంటికి చేర్చాలని సిబ్బందికి సూచించారు.