KNR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హుజురాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ‘హ్యాపీ సండే’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ బి. కిషన్ తెలిపారు. రేపు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యకర జీవనశైలి, సమాజంలో క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.