JN: నర్మెట్ట మండలం ఆగపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బోయినీ శ్రీరాములు ఉదయం మరణించారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర రీజినల్ ట్రాన్స్‌ఫోర్ట్ అథారిటీ మెంబర్ చిలువేరు అభి గౌడ్, కాంగ్రెస్ నాయకులు సోమవారం మృతుడి నివాసానికి వెళ్లి, ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.