MDK: రైతులకు రావాల్సిన రైతు బంధు నిలిపివేయడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నార్సింగి మండలం శంకాపురం గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములకు సంబంధించి రైతు బంధు మొత్తాలు నిలిపివేయడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం చట్టవిరుద్ధమని ప్రాథమికంగా గుర్తించిన న్యాయస్థానం, కలెక్టర్ సహా సంబంధిత అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.