భువనగిరి జిల్లా కార్యాలయంలో ఉపాధిహామీ పథకంలో అత్యధికంగా NMMS ద్వారా హాజరు నమోదు చేస్తూ, ఎక్కువ మంది కూలీలతో పనులు నిర్వహించిన 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను అడిషనల్ కలెక్టర్ శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరికి రూ.1000 ప్రైజ్ మనీ అందజేశారు. వారి సేవలను ప్రశంసిస్తూ మరింత కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో DRDO నాగిరెడ్డి, అడిషనల్ RDO సురేశ్ పాల్గొన్నారు.