MNCL: తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు గురి చేయడం మానుకోవాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు డి. బ్రహ్మానందం డిమాండ్ చేశారు. గురువారం శ్రీరాంపూర్‌లో మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యమే సమ్మెకు కారణమని తెలిపారు. వెంటనే ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.