ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) దేశవాళీ క్రికెటర్ల సంక్షేమం కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. 2026-27 సీజన్ నుంచి తన జట్టు ఆటగాళ్లకు వార్షిక కాంట్రాక్టులను అందించాలని నిర్ణయించింది. భారత క్రికెట్ చరిత్రలో ఒక రాష్ట్ర అసోసియేషన్ తన ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.